ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డులో చర్చ జరిపారు. ఏపీలో పర్యాటకరంగానికి ఊతం ఇచ్చే దిశగా పలు కిలక ప్రాజెక్టులు రానున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాదాపు 48 వేల మందికి ఉద్యోగ అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా…
క్రెడాయ్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ గడువును పొడిగించాలని క్రెడాయ్ ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. టీడీఆర్ బాండ్ల జారీ.. వాటి కాల పరిమితి.. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఎల్ఆర్ఎస్ అమలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, ఆన్ లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను క్రెడాయ్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వీటిపై స్పందించిన…
మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉంది. దీనిపై ఎన్ఐఏ సహకారం తీసుకుని…
రైతులకు సంబంధించి ఒకే రోజు 3 పథకాలను సీఎం జగన్ అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి, కన్నబాబు అన్నారు. ప్రతి రైతు సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల్లో ఇచ్చిన మాటను వంద శాతం నెరవేర్చుతూ సీఎం జగన్ వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు రూ. 18,775 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ప్రభుత్వం నచ్చిందన్నారు. ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం…
అయిననూ పోయిరావలె హస్తినకు…! ఇదే కాన్సెప్ట్తో చంద్రబాబు అండ్ కో ఢిల్లీ వెళ్లిందా? దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆయన ఏదైనా సాధిస్తారా? ఈ సమయంలో టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? టీడీపీ ఆఫీసులపై దాడులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు..! టీడీపీ ఆఫీస్పై దాడి చేశారనే అంశంపై ఒక రోజు రాష్ట్ర బంద్కు పిలుపిచ్చి.. మరో రెండు రోజులు దీక్ష చేపట్టిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని…
పోలీసు పరాక్రమాలు తెలియజేసే ” క్రాక్ ” చిత్రాన్ని అనంతపురం త్రివేణి కాంప్లెక్స్ లోని బిగ్ సి థియేటర్ లో ప్రదర్శించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శింపజేశారు. దీంతో వందలాది మంది విద్యార్థులతో బిగ్ సి థియేటర్ కిటకిటలాడింది. ఈ చిత్రంలో హీరో రవితేజ పోలీసు అధికారిగా పరాక్రమ విధులు నిర్వర్తించడం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. ఈ చిత్ర ప్రదర్శన కార్యక్రమంలో…
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు బూతు పురాణాల రాజకీయంతో జనాలకు అసహ్యం వేస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కొడాలి నాని, వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని పశువులకన్నా హీనంగా మాట్లాడారు… జగన్ అరాచక పాలనపై మేము మా నాయకుడు చంద్రబాబు నాయడు మాట్లాడితే మాపై శాపనార్థాలు పెడతారా అంటూ దేవినేని ఉమ…
లైంగిక వేధింపుల ఘటనలపై మహిళా కమిషన్ ఫోన్ ద్వారా కేసు పూర్వ పరాలను తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కేసు పూర్వాపరాలు విచారించి…వాలంటీర్…
ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు గంజాయి, మరోవైపు అక్రమ మద్యం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కర్నూలు జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మకరం చేశారు. అక్రమ రవాణా పై కర్నూలు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. కర్నూలు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పంచలింగాల వద్ద సెబ్ తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక బ్యాగ్లో 75 లక్షల రూపాయలు నగదు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న…
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూర్ వద్ద వర్షపు నీరు ఇళ్ళ లోకి చేరి చేనేత కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్కడ ఉన్న కాలువను మట్టితో కప్పేయడం తో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షం పడిందంటే ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోడూరు గ్రామానికి చెందిన కార్మికులు వాపోతున్నారు. తమ ఇంటి పక్కనే నేషనల్ హైవే పనులు జరుగుతుండడంతో ఉన్న ఇరిగేషన్ కాలువను మట్టితో…