నేడు మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటంచనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పంచాయతీ రాజ్ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. PKM UDA (పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రమాణ స్వీకారం, కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొంటారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే వారు ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇది ఊహించని పరిణామం. బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబర్ జీతంలో 10 నుంచి 50శాతం వరకు తగ్గించారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్22 వరకు హాజరు డాటా ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలి. కానీ బయోమెట్రిక్ మెషీన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకుండా తమ జీతాల్లో కోత విధించడమేంటని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా…
గత కొన్ని రోజులగా శ్రైశైలం జలాశయానికి వరదనీరు రాగా, ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గుతోంది. ఎగువన ఉన్న జలాశాయల్లోకి వరద నీరు తగ్గడంతో గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ఇన్ఫ్లో: 16,135 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 70,831 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రైశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880.10 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సీటీ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.VIT,SRMకు గరిష్ఠంగా రూ.70 వేలు, సెంచూరియన్కు రూ.50వేలుగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. బకాయిలు బాగా పెరిగిపోవడంతో కాకినాడ JNTU పరిధిలోని కాలేజీల గుర్తింపును నిలిపివేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతానికి పైగా అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ సీట్లను కన్వీనర్ కోటాలనే భర్తీ చేస్తారు. ప్రభుత్వం ఫీజలు ఖరారు చేయకుంటే ప్రవేట్ వర్సీటీలు ఇష్టారీతిన విద్యార్థుల నుంచి అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం…
అమరావతి : తెలుగు దేశం ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. ఇక…
మహిళా కమీషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో మహిళల ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతకు జగన్ మోహన్రెడ్డి కంకణబద్దులై ఉన్నారన్నారు. గతంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదన్నారు. మహిళ పక్షపాతి అనే దురుద్దేశంతో జగన్ పై కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ, నామినేట్డ్ పదవులు, పార్టీ పదవుల్లో మహిళలకు అధికంగా అవకాశం కల్పించారన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆడవారిని…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన లో వెల్లడించింది. అయితే… విశాఖ టూర్ షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం నుంచి విశాఖ బయలు దేరాల్సి ఉంది. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ చేరుకుని ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లై ఓవర్ తో పాటు.. వీఎంఆర్డీఏ పూర్తి చేసిన 6…
ఏపీలో ఎఫ్డీల స్కామ్లో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్, ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ లలో 14 కోట్ల రూపాయల ఎఫ్డీల స్కాంల గల్లంతు కేసులో అరెస్టులు జరిగాయి. గిడ్డంగుల శాఖ కేసులో IOBబ్యాంక్ అప్పటి మేనేజర్ జి.సందీప్ కుమార్ అరెస్టయ్యారు. ఆయిల్ ఫెడ్ నిధుల దుర్వినియోగం కేసులో పూసలపాటి యోహాన్ రాజు అరెస్ట్ అయ్యారు. స్కామ్ లో భాగస్వాములుగా ఉన్న మరో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్…
కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తరచూ ఇలాంటివి జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్ లో క్షుద్రపూజలు జరిగాయి. మట్టితో తయారు చేసిన బొమ్మలు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు జరిగాయని తెలుస్తోంది. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు. అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. గొర్రెల కాపరులు ఫారెస్ట్ లో క్షుద్రపూజలపై భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి తాంత్రిక పూజల పై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో వున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. 2019లో 77శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ పెంచాలని, మెజారిటీ ఎక్కువ వచ్చేలా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ పొటీచేస్తున్న రెండు జాతీయ పార్టీల గురించే అంతా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అంపశయ్యమీదే వుంది. ఎక్కడా సరైన…