మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాడే పల్లిలోని మహానాడు ప్రాంతం లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శాసనసభలో మా తల్లిని అవమానించారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించు కున్నారని లోకేష్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు సమాచారం లేకుండా ఇళ్లను తొలగిస్తున్నారని వారి గోడు వినిపించారు.
వైసీపీ నేతలకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని లోకేష్ అన్నారు. వైసీసీ నాయకులు ఇప్పటికైనా మాట్లాడే ముందు ఆలో చించాలని అనవసరంగా నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటా యని ఆయన హెచ్చరించారు. అధికారం ఉందని ఎవ్వరిని పడితే వారిని ఎలాపడితే అలా మాట్లాడితే అది వారికే మంచిది కాదని ఆయ న హితవు పలికారు. తొందర్లనే వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని లోకేష్ అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని తెలిపారు.