కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్తూ బైక్ నుంచి కింద పడి ఇంజినీరింగ్ యువతి మృతి చెందిన ఘటన ఓర్వకల్ మండలం ఎంబాయి వద్ద చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన ఓ యువతి.. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈనెల19న ఆ యువతికి వేరే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లక్ష్మిపురానికి చెందిన వెంకటేశ్వర్లుని ఆమె ప్రేమించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తన…
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల ధనదాహానికి అంతులేకుండా పోతోంది. లక్షలు మిగుల్చుకోవడానికి ఫేక్ ప్రొఫెసర్లు, ఫేక్ లెక్చరర్లతో పాఠాలు చెప్పిస్తున్నారట. కాకినాడ JNTU పరిధిలో ఉన్న 180 కళాశాలల్లో దాదాపు 200 మంది ఫేక్ లెక్చరర్లు ఉన్నారట. ఇది బహిరంగ రహస్యమే అయినా.. JNTU పట్టనట్టు వ్యవహరించడమే అనుమానాలకు తావిస్తోందట. నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో 200 మంది అధ్యాపకులు?రూ.40వేల వేతనం ఇస్తోన్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు..? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల్లో…
నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం మరో 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. ఈ…
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన కళ్యాణకట్ట సిబ్బంది తీరు విమర్శలకు కారణం అవుతోంది. ఆలయం కేశఖండనశాలలో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు. అక్కడ చేతివాటం చూపించారు 12 మంది క్షురకులు. దేవస్థానం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను పరిశీలించిన ఈవో లవన్న ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. చేతివాటానికి పాల్పడిన 12 మంది క్షురకులను విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల…
గోదావరి – కావేరి జలాల అనుసంధానం కోసం ఆయా రాష్ట్రాలతో సమావేశం నిర్వహించినట్టు ఎన్ డబ్య్లూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని కోసం డీపీఆర్తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హిమాలయ బేసిన్లో ఉన్న మిగులు జలాలను దక్షిణానికి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. గోదావరి – కావేరి లింక్ కోసం ఇప్పటికే డీపీఆర్ రూపొందించినట్టు వెల్లడించారు. దీనిని అన్ని రాష్ట్రాలకు డీపీఆర్ అందించామని దీనిపై ఆయా రాష్ట్రాలు తమ…
అనంతపురం : ప్రశాంత్ కిషోర్ కాదు… వాళ్ల నాన్న.. తాతకు కూడా భయపడేది లేదని… చంద్రబాబు రాజకీయాల్లో నుంచి ఇక తప్పుకోవాలని.. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. వంటగ్యాస్ మొదలు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు, పేదలు అల్లాడిపోతున్నారని… యువతకు మత్తు మందులు అలవాటు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 20 వేల కోట్ల విలువైన మత్తు మందు పట్టుకుంటే అమిత్ షా అసలు ఎందుకు మాట్లాడరని…. ఏ మంత్రులు నోరువిప్పటంలేదని…
కడప జిల్లా బద్వేల్ లో భారీ వర్షం కురుస్తోంది.. ఇవాళ వేకువ జాము నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బద్వేల్ పోలింగ్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే… వర్షం లో నైనా పోలింగ్ సామాగ్రిని తీసుకెళుతుంది ఎన్నికల సిబ్బంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షంలోనైనా… తమ డ్యూటీ ని సక్రమంగా నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే.. రేపు కూడా వర్షం బాగా పడితే.. పోలింగ్ శాతం తగ్గే…
పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ మగ్గాల యజమానులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అనంతపురంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ దాడులు తూతూమంత్రంగా జరిగాయంటున్నారు. మగ్గాల యజమానులతో కుమ్మక్కై ఎలాంటి కేసు నమోదు చేయకుండా మూడురోజులపాటు విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఇలాంటి దాడులతో ఒరిగేదేం లేదంటున్నారు. మూడునాళ్ళ ముచ్చట అనే రీతిగా వ్యవహరించిన తీరు అనంతపురం జిల్లా హిందూపురం లో జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురం పవర్లూమ్స్ యూనిట్ల పై ఎన్…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగానే వస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,896 శాంపిల్స్ పరీక్షించగా.. 381 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 414 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి…
ఏపీ మంత్రి పేర్నినాని కేసీఆర్ ఫ్లీనరీ సందర్భంగా మాట్లాడిన మాటలపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని కేసీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నామని, రెండు రాష్ట్రాలలో పార్టీ ఎందుకు, దానికన్నా తెలంగాణ క్యాబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపే తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగంగా మాట్లాడారు. కేసీఆర్కు ఏపీలో పార్టీ పెట్టాలని అంత కోరికగా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్పై మీడియా సమావేశంలో మంత్రి పేర్ని…