ప్రేమను పంచె తల్లిదండ్రులకు ఆ పిల్లలు తప్పు చేస్తే మందలించే హక్కు కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం చిన్న బాలుడిని కూడా మందలించాలి అంటే తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ్ముడితో గొడవ పడొద్దని మందలించినందుకు ఓ 10 ఏళ్ళ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా లోని ఇబ్రహీంపట్నం లోని గాజులపేటలో సిద్ధార్థ అనే బాలుడు 5 తరగతి చదువుతున్నాడు. అయితే తల్లి మందలించిందని ఉరి వేసుకుని మృతి చెందాడు. దీనితో ఇబ్రహీంపట్నం గాజులపేటలో ఘోర విషాదం నెలకొంది.
Read also:NTR Neel: ఆయన సినిమాలే మాస్ గా ఉంటాయి ఇక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏ రేంజులో ఉంటుందో
పోలీసుల సమాచారం ప్రకారం.. స్కూల్ నుంచి రాగానే తన చిన్న తమ్ముడు మోక్షజ్ఞతో గొడవ పడుతూ ఉండగా తల్లి సిద్ధార్థ్ ను మందలించింది. దీనితో మనస్థాపానికి గురైన పదేళ్ల సిద్ధార్థ్ ఇంట్లో బట్టలు ఆరవేసే దండంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎస్సై విజయలక్ష్మి హుటాహుటీన ఘటన స్థలకానికి చేరుకున్నారు. అనంతరం. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పైన
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాలుడి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. కుమారుడి మృతితో బాలుడి తల్లి గుండెలవిసేలా రోదిస్తుంది. ఆమె రోదన చూసిన వాళ్లకు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.