Kuna Ravi Kumar: బీసీలు బాగుపడితే.. సీఎం జగన్‌కు కడుపు మంట: రవికుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో బీసీలు బాగుపడితే సీఎం వైఎస్ జగన్‌కు కడుపు మంట అని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోందిని.. దళితులను, బీసీలను అవమానించే యాత్ర జరుగుతుందన్నారు. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారని రవికుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో పేరుకే బీసీ మంత్రులు ఉన్నా పెత్తనం అంతా రెడ్లదే అని పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో కూన రవికుమార్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో సీఎం జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది. దళితులను , బీసీలను అవమానించే యాత్ర జరుగుతుంది. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారు. ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని, గౌతు శిరీష, పంచుమర్తి అనురాధలు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు. బీసీ మహిళలను అవమానించి రోతపుట్టించే రాతలు రాయించి.. నా బీసీలు అని మాట్లాడటానికి సిగ్గుందా?. పేరుకే బీసీ మంత్రులు.. పెత్తనం అంతా రెడ్లదే?. జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు. బొత్స, ధర్మాన, సీదిరి, తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు’ అని అన్నారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Also Read: TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!
‘మా హయాంలో 74 మంది బీసీలు, దళితులు 28 మంది ఉన్నారు. రజక, యాదవ, నాయిబ్రాహ్మన, మత్స్యకార, గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం. టీటీడీ చైర్మెన్లుగా బీసీలకు పెద్ద పీట వేసింది టీడీపీనే. వైసీపీ రెడ్డిలను మాత్రమే టీటీడీ చైర్మెన్ చేసింది. అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలకు బీసీలు అశపడాలా?. ధర్మాన, బొత్స, తమ్మినేని నిజమైన బీసీలు కాదు. ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు. 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది వీసీలు రెడ్లేనా?. బీసీలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబుపై కుట్ర చేసి అక్రమ కేసులు పెట్టారు. బీసీలు బాగుపడితే జగన్‌కు కడుపు మంట. బీసీల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు’ అని రవికుమార్ పేర్కొన్నారు.
- Tags
- ap
- Kuna Ravi Kumar
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!