Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains in AP for three days Due to Low pressure in Bay of Bengal: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని చెప్పారు.
ఇది డిసెంబర్ 1వ వరకు తుఫాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఆపై ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని.. 4వ తేదీకల్లా తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందట. ఇక 5వ తేదీకల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫాన్‌గా తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్ బలహీనపడుతుందని పేర్కొన్నారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Also Read: Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!