టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్ విసిరారు. ఆర్యవైశ్యులకు తాను ఏం అన్యాయం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆపీస్‌కు రమ్మన్నా కూడా తాను సిద్ధమే అంటూ వెలంపల్లి సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బందిపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం జరగకుండా మాజీమంత్రి వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన…
Kakinada Doctor committed Suicide: కాకినాడలో యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్‌నగర్‌కు చెందిన వైద్యుడు నున్న శ్రీకిరణ్ చౌదరి (32) శనివారం గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్‌హెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. ఆస్తి విషయమై శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. Also Read: Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు..…
Huge Devotees in Srisailam Temple on the occasion of Karthika Masam 2023: కార్తికమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఉత్తర మాఢవీధి పూర్తిగా కార్తిక దీపారాధనలతో వెలిగిపోతుంది. కార్తికమాసం, అందులోనూ సెలవు దినం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం…
ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ద్వారా భారతదేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు నవంబర్ 26న ఆల్ ఇండియా రేడియోలో 107వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వికలాంగులు కూడా బీజేపీ.. ఏఎంపీ మీడియా సెంటర్లో ఈ కార్యక్రమాన్ని వింటారు. దానితో పాటు నాయకులు కూడా హాజరుకానున్నారు. రాజస్థాన్‌లో బంపర్…
Chandrababu Naidu to attend Siddarth Luthra Son’s Wedding Reception: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. నవంబర్ 27న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు బాబు హాజరవుతారు. లూథ్రా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు బాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి రిసెప్షన్‌కు హాజరుకానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్…
Markapuram MLA brother KP Krishnamohan Reddy Slams TDP Leaders: మార్కాపురం టీడీపీ నేతల భూదందాలు బయటపెట్టడంతో పాటు వారి ఆదాయానికి గండి కొట్టాననే ఉద్దేశంతో తమపై, వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. తమపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గత రెండు రోజులుగా టీడీపీ…
నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. నేడు సంగారెడ్డి జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు రాహుల్ హాజరుకానున్నారు. నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొననున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్…
ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. విశాఖ లోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. ఆదివారం రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి.. ఈ ప్రమాద సమయంలో మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.. మత్స్యకారులు తమ బోట్లు…
4 Injured in Vijayawada Car Racing: ఏపీలోని విజయవాడ నగరంలోని జాతీయ రహదారిపై శనివారం (నవంబర్ 18) అర్ధరాత్రి కార్ల రేసింగ్ జరిగింది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు రేస్ నిర్వహించారు. ఐఈపీఎల్ ఐనాక్స్ ఎదురుగా రెండు కార్లు అతివేగంగా దూసుకొచ్చాయి. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు వేంటనే…
వైన్ షాపులు బంద్: భారతీయులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్త్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైన్ షాపులను కూడా బంద్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.…