Mudragada Padmanabham Meeting with His Followers Today: కొత్త సంవత్సరం వేళ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ రోజు తన రాజకీయ నిర్ణయంపై అనుచరులకు ముద్రగడ ఓ స్పష్టత ఇవ్వనున్నారు. ప్రస్తుతం ముద్రగడ నివాసానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ సహా ఆయన ఇద్దరు కుమారులకు అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి తిరిగి ఎప్పుడు వస్తారు? అని ముద్రగడను అనుచరులు అడుగుతున్నారు.
కాకినాడలో ఎన్టీవీతో ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడు గిరిబాబు మాట్లాడారు. ముద్రగడ రాజకీయంకు సంబంధించిన పలు విషయాలపై గిరిబాబు స్పందించారు. ‘ముద్రగడ ఎప్పుడు పాలిటిక్స్‌కి దూరంగా లేరు. త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరుతారు. ముద్రగడ ఆదేశిస్తే.. నేను కూడా పోటీ చేస్తాను. ఇద్దరం కూడా పోటీ చేయవచ్చు. చేరికకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పొలిటికల్ ఫ్యూచర్‌కు సంబంధించి త్వరలోనే నిర్ణయం ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఎప్పుడు ప్రజలలోనే ఉన్నాము. నాలుగు సంవత్సరాల తర్వాత అభిమానులతో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని గిరిబాబు అన్నారు.
Also Read: Maddali Giridhar Rao: బీసీ మహిళ గుంటూరులో పోటీ చేయకూడదా?.. టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు క్షమించరు!
రాజకీయాల్లోకి తిరిగి ఎప్పుడు వస్తారు? అని ముద్రగడను అనుచరులు అడగ్గా.. టైం వచ్చినప్పుడు అదే జరుగుతుందని ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ముద్రగడకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యత, పదవిపై స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ రోజటి సమావేశంలో ముద్రగడ తన నిర్ణయం ఏంటో అనుచరులకు వెల్లడించే అవకాశం ఉంది.