ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటైంది. సీఈసీ ఆదేశాలతో సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ విచారణ జరపనుంది. 13 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు.
ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీవ్ (సిట్).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు.. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్.. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్.. అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ? వాటికి బీజం వేసింది ఎవరు? హింసాత్మకంగా మారడానికి…
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ అయ్యింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడింది.