YS Jagan: గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు.. మీరు పాలించడానికి అర్హులేనా?.. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని ప్రశ్నించారు.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అత్యంత సమస్యాత్మక క్రేందాలను గుర్తించి కార్డెన్ సెర్చ్ చేస్తున్నారు. 3 సీఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెంగళూరు అర్బన్ లో 30 శాతం ఏ.ఎస్.డి ఉంది.. ఇక, స్ట్రాంగ్ రూంలో ఈవీఏంలు పటిష్ఠమైన భద్రంగా ఉన్నాయి.. చాలా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. ముందుగా 8 గంటలకు…
పోలింగ్ అనంతర అల్లర్లపై సిట్ విచారణ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సిట్ రంగంలోకి దిగింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం నుంచే సిట్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను సిట్ బృందం పరిశీలించింది.
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది.
కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షించారు. ఎన్నికల రోజు పోలీసుల పనితీరు భేష్ అంటూ ఆయన ప్రశంసించారు. జమ్మలమడుగులో ఎన్నికల రోజు తలెత్తిన వివాదాలను పోలీసులు చాకచక్యంగా అణిచివేశారని.. పోలీసులు ప్రాణాలకు తెగించి చాలెంజింగ్‌గా పరిస్థితులను అదుపు చేశారని చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
కడప గౌస్ నగర్‌లో పోలింగ్ రోజున సాయంత్రం జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. సంబంధిత పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. వారికి ఛార్జ్ మెమో జారీ చేశారు జిల్లా ఎస్పీ.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.