AP Special Status: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీ ఏపీకి ప్రత్యేక హోదా.. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది.. ఏపీకి ప్రత్యేక హోదా అమలుకు నోచుకోలేదు.. అయితే, ఎప్పటి కప్పుడు ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ లాంటి చర్చలు మాత్రం సాగుతూనే ఉన్నాయి.. తాజాగా, ఏపీకి ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..…
ఏపీ విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్… రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందన్నారు.. ఇక, స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. రాహుల్ యాత్రతో ప్రజలల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం, ఆదరణ పెరుగుతోందన్న ఆయన.. బీజేపీకి మాట్లాడే అర్హతేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశం,…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి. దావోస్ పర్యటన ఓ గండికోట రహస్యమంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే వెళ్లాల్సింది దావోస్ కి కాదని, ఢిల్లీకి అని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే దావోసే ఏపీకి పరిగెత్తుకు వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ కారిడార్, విశాఖ ఉక్కును కాపాడటం…
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉంటాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని ఉద్యమం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు పక్క రాష్ట్రంలో ఎంపీ పదవి తెచ్చుకున్న వ్యక్తి అని.. పదిహేను రోజులకు…
ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం అసలు ప్రస్తుతం ప్రస్తావనలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. రెవిన్యూ డెఫిషిట్ గ్రాంట్ ఏపీకి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఏపీ అభివృద్ధిపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని.. వెలిగొండ విషయంలో ప్రస్తుత, గత ప్రభుత్వాలు…
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల కోసం ఏర్పాటు చేసిన సమావేశం అజెండాలో మొదట ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి.. ఆ తర్వాత తొలగించింది కేంద్ర హోంశా శాఖ.. ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం హోంశాఖ సమావేశం అజెండాలో ప్రత్యేకహోదా అంశం పొరపాటున చేర్చారని తెలిపారు.. ఈనెల 17న జరిగే సమావేశం..…