ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేశారు..తెలుగు రాష్ట్రాల్లో ప్రధానిగా రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నాం..రాష్ట్రాల అభివృద్ధి పర్యటన కాదు..దురుద్ధేశ్య పర్యటన..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంవత్సరం నుండి పని చేస్తూనే ఉంది..తెలంగాణ లో పార్టీ అభివృద్ధి చేసుకోవడమే పనిగా ఇక్కడ పర్యటించారు.. 24 నియోజకవర్గాల్లో సింగరేణి విస్తరించి ఉంది..రామగుండం సభలో సింగరేణి ప్రైవేట్ చేయడం లేదని మోడీ అబద్ధాలు చెబుతున్నారు..49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది ఉంది..2015 లో చట్టాన్ని మార్చారు.. 240 మైన్స్ లో 95 మైన్స్ ప్రయివేటు వాళ్ళకిచ్చారన్నారు నారాయణ.
Read ALso: Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
డెక్కన్ వాళ్ళ నుండి తీసుకున్నప్పుడు ప్రయివేటు వాళ్ళకి ఇవ్వొద్దని ఒప్పందం ఉంది..4 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి కమర్షియల్ మైన్స్ కి ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు..రాబోయే రోజుల్లో ప్రైవేటు పరం చేసే ప్లాన్ చేశారు..దేశవ్యాప్తంగా కోల్ ఇండియా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు..లక్షా 40 వేల మంది ఉద్యోగులు ఉండే సింగరేణి లో ఇప్పుడు 40 వేల మంది మాత్రమే ఉన్నారు..ఔట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు..అంబానీ,ఆదాని లాంటి కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తారు..ఏడున్నర ఏళ్ల క్రితం ఆధాని కి ఏడు వేల కోట్ల అప్పుగా ఉండేది..దానిని బ్యాంకు లు నమ్మలేదు..ఇప్పుడు ప్రపంచంలోనే రెండోస్థాయి కి ఎదిగారు..
ప్రపంచంలోనే కుంభకోణాలకు నాయకత్వం వహించేంది మోడీనే.. 29 మంది లక్షల కోట్లు కొల్లగొట్టిపోయారు..అవినీతి పరులను అంతమొందిస్తానన్న మోడీకి ఆధాని కనబడడం లేదా..పోర్టులు ఆధాని సొంతం అయిపోతున్నాయి..పోర్టుల ద్వారా డ్రగ్స్ సప్లయ్ జరుగుతుంది..సీబీఐ,ఈడీ దాడులు దురుద్ధేశ్యం తో చేస్తున్నారు..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు ఎందుకు అమలు చేయరు..మొన్నటి వరకు కేసీఆర్ బీజేపీ కి దగ్గరగా ఉన్నారు..రాష్ట్రాల హక్కులు కొల్లగొట్టడం వల్లే తిరగబడ్డారు..మునుగోడు లో టీఆరెస్, వామపక్షాల ఉమ్మడి వ్యూహం ఫలించింది..కమ్మునిస్ట్ లు అమ్ముడుపోయారని చెబుతున్నారు.. బీజేపీ ని వ్యతిరేకించడానికి మద్దతు ఇచ్చాము..
ఎలాంటి ప్యాకేజి లతో మాకు సంబందం లేదు..నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తే ఆధారాలతో బయటపెడితే… ఎదురుదాడి చేస్తున్నారు..ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం..రాజధాని కి నిధులు, పోలవరం, ప్రత్యేక హోదా, ప్యాకేజి దేనిపై కూడా మోడీ హామీలు ఇవ్వలేదు.రాజకీయాలకు అతీతంగా దండం పెట్టి మా రాష్ట్రాన్ని ఆదుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు..రాజకీయాలకు అతీతంగా అంటే 420 ..
జగన్మోహన్ రెడ్డి తెలుగులో చెప్పాడు.. మోడీకి తెలుగు రాదు..జగన్మోహన్ రెడ్డి అడిగిన ఏ ఒక్కటి కూడా ఇస్తా అని మోడీ చెప్పలేదు..3 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ అమ్మేసి 11 వేల కోట్లు రోడ్లకు అంటే ఎవరు నమ్ముతారు..ఏపీ లో ysrcp బలంగా ఉండాలి టీడీపీ బలహీనంగా ఉంటే తప్ప బీజేపీ బలపడదని మోడీ ప్లాన్..పవన్ కళ్యాణ్ ని 3 రోజుల క్రితమే కలవమని పిఎంవో నుండి సమాచారం ఇచ్చారు..రాబోయే రోజుల్లో కమ్మునిస్ట్ పార్టీలు బలపడాలి..బీజేపీ బలహీనపడలి. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తాం..సీపీఐ నిరసన సక్సెస్ అయింది.. రెండు రాష్ట్రాల్లో వేలాదిమంది ని అరెస్ట్ చేశారు..మోడీ స్వయంగా సింగరేణి ప్రైవేట్ చేయమని ఒప్పుకున్నారు..కేసీఆర్ ని వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు పోలీసులు మా పార్టీ కార్యాలయంలో కి రాలేదు..ఢిల్లీ లో లా అండ్ ఆర్డర్ మోడీ చేతిలో ఉన్నట్టే..తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ మోడీ కి అప్పగించారేమో అనిపించింది..తెలంగాణ పోలీసులను కేసీఆర్ మోడీకి అప్పగించారా? అని ప్రశ్నించారు నారాయణ.
Read Also:Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?