రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నవారు.. సర్వీస్‌లో చేరి పది-పదిహేనేళ్ల తర్వాత అవినీతికి అలవాటు పడటం పాత ట్రెండ్. ఉద్యోగంలో చేరిన వెంటనే బల్ల కింద చేతులు పెట్టడం కొత్త ట్రెండ్. ఏపీ సచివాలయంలో ఇలాంటి వారి సంఖ్య పెరిగిందట. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఒక సమస్య IASలకే షాక్ ఇచ్చిందట. దానిపైనే సెక్రటేరియట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉద్యోగంలో చేరిన 6 నెలల్లోనే లంచాలు! ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైనా కొత్తగా చేరితే ఉత్సాహంగా పనిచేస్తారు. చకచకా పనులు…
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలాని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు అక్కడ మరో కరోనా మృతి నమోదయ్యింది. ఏపీ సెక్రటేరీయేట్లోని పోస్టాఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగి కరోనాతో మరణించాడు. మూడో బ్లాక్ లో ఉన్న ఇండియా పోస్టాఫీసులోని పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఏపీ సచివాలయంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరింది. దాంతో ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు…
కరోనా పై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా సెకండ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ చాలా ప్రమాదకరంగా మారుతుంది. కరోనాతో సచివాలయంలో గత మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మరణించారు. సచివాలయ ఉద్యోగులు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం ఇస్తే ఉద్యోగులకు కొంత ఊరట కలుగుతుంది. కనీసం వారం పాటు అందరికీ వర్క్ ఫ్రం హోం…
ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కరోనా సెకండ్ వేవ్ భయం నెలకొంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కరోనాతో మృతి చెందారు. శుక్రవారం సచివాలయంలో 200 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఆ ఫలితాలు రావలసి ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఉద్యోగులు…