ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగ్గారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సినియార్టీని ఫైనల్ చేయకపోవడంపై నిరసన చేస్తున్నారు. గతేడాది ఆగస్టులోనే ఆర్థిక శాఖ ఉద్యోగుల సినియార్టీ ఫైనల్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. సీఎం ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చేయడం లేదంటూ ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో ఉద్యోగుల సినియార్టీని ఫైనల్ చేయలేదు ఉన్నతాధికారులు. ఎనిమిది మిడిల్ లెవల్ పోస్టులు భర్తీ చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆ జాప్యంతో ఉన్నతాధికారులకు ఉద్యోగులకు మధ్య గ్యాప్ వచ్చింది.