తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ శాఖ పరిధిలోని వివిధ కార్యక్రమాల్ని సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని.. గుంతలు లేని రోడ్లు కనిపించాలని సూచించారు. రాజధానిలో కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లేఅవుట్ ఉండేలా…
రహదారులు, భవనాల శాఖతో పాటు విశాఖ బీచ్ కారిడార్ పనుల పురోగతి పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. రహదారుల భద్రత కోసం ఒక లీడ్ ఏజెన్సీను ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. దీనిలో పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్, రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి నిపుణులు ఉంటారు. రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకూ సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. మరోవైపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సంయుక్తంగా ఒక డ్రైవింగ్ స్కూలు…
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి విమర్శలు చేశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల పోటీలు, హరిదాసుల పాటలు అని.. కానీ వైసీపీ సర్కారు క్యాసినో సంస్కృతిని తీసుకొచ్చి పండగ వాతావరణాన్ని అబాసుపాలు చేసిందని మండిపడ్డారు. ఏపీలో జిల్లాల విభజనపై ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధంగా…
త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు.. నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆర్ అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సీఎం సూచనల మేరకు ముందుగా రోడ్ల మరమ్మత్తులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 2,205 కోట్లు కేటాయించింది. రోడ్లను బాగు చేసేందుకు నిధులను సమీకరిస్తున్నాం. రోడ్ సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఎస్క్రో చేసి అప్పు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 8,268 కి.మీ పొడవు రోడ్లను మెరుగుపరచడానికి.. 308 స్టేట్…
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. ఆ తర్వాత ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పోసాని కృష్ణ మురళి కూడా ఘాటుగా స్పందించాడు.. వీటి అన్నింటికీ కలిపే అదేస్థాయిలో మళ్లీ కౌంటర్ ఎటాక్ చేశారు పవన్.. అయితే, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడి నేను ఆ స్థాయి దిగజారదలుచుకోలేదంటూ కామెంట్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోడ్ల దుస్థితికి గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ఆరోపించారు మంత్రి శంకర నారాయణ… సీఎం వైఎస్ జగన్.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేపడతామని ప్రకటించారు.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ రోడ్లను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించిన శంకర నారాయణ.. అక్టోబర్ తర్వాత రోడ్ల పనులు ప్రారంభిస్తామని…