VIjaysai Reddy ఏపీలో రాజకీయం మిర్చి అంత హాట్ హాట్ గా వుంటుంది. అందునా వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మామూలుగా వుండదు. తాజాగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysaireddy) ఒక రేంజ్ లో చంద్రబాబు అండ్ కోని ట్వీట్లతో ఆడుకున్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు (chandrababu Naidu), ఆయన కుమారుడు లోకేష్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆధారాలతో కట్టకట్టి మీ దుష్ప్రచారాన్ని పదింతలు చేసే సామర్ధ్యం తనకు ఉందన్నారు. రెంటు లేని రోజుల్లో జనరేటర్లతో నడిచే టూరింగ్ టాకీసులు గ్రామాలకు వస్తే ఊరంతా అక్కడే ఉండేది. సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు ఆ తర్వాత అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTTలు వచ్చాయి. జనం ఈ మార్పులను స్వాగతిస్తున్నా స్టే’బిఎన్ మాత్రం పాత రోజుల్లోనే బతుకుతున్నాడు. భజన మీడియా కూడా అంతే అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
Chandrababu Naidu: 21, 22 తేదీల్లో వరదప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
బాగున్న రోడ్లను తవ్వుతూ, వర్షాలకు దెబ్బతిన్నరోడ్లపై సెల్ఫీలు దిగేకంటే వాటిని పూడ్చి పేరు తెచ్చుకోండి. మన రోడ్లను మనమే బాగుచేసుకుందాం అనే స్పూర్తిని ప్రదర్శించండి. జనాదరణ పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో పాడైన రోడ్ల ఫోటోలతో వెర్రి పుష్పాలు కావొద్దు. గజినీ బాబు కోరుకునేది అదే.చంద్రబాబు పుట్టిన తర్వాతే అబద్ధం అనే పదం తెలుగు డిక్షనరీలో చేరింది. అతను అసత్యాలను అలవోకగా వాడినట్టుగా గోబెల్స్ కూడా వాడలేదు. చివరకు తానే ఒక నమ్మకం లేని మనిషి అయిపోయాడు. దేశ రాజకీయాల్లో ఇలాంటి Pathological Liar ఇంకెక్కడా కనిపించడు. అంత చెత్త పేరు తెచ్చుకున్నాడు ముసలి నక్క అంటూ ఒక రేంజ్ లో ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబు, లోకేష్ పరిధి దాటొద్దని విజయసాయి హెచ్చరించారు. అసభ్యపదజాలం వాడాలంటే మీ కంటే పదింతలు ఉపయోగించాల్సి వస్తుందన్నారు విజయసాయి. వైయస్ఆర్‌సీపీ చాలా పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. మా పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేయవద్దు. ఎదుటివారిపై బురద జల్లి ఆనందించడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు విజయసాయి. మొత్తం మీద అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల ఘాటు విమర్శలతో వాతావరణం వేడెక్కింది.
Vijaysaireddy Latest Tweet
చంద్రబాబు పుట్టిన తర్వాతే అబద్ధం అనే పదం తెలుగు డిక్షనరీలో చేరింది. అతను అసత్యాలను అలవోకగా వాడినట్టుగా గోబెల్స్ కూడా వాడలేదు. చివరకు తానే ఒక నమ్మకం లేని మనిషి అయిపోయాడు. దేశ రాజకీయాల్లో ఇలాంటి Pathological Liar ఇంకెక్కడా కనిపించడు. అంత చెత్త పేరు తెచ్చుకున్నాడు ముసలి నక్క.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 16, 2022