ఈమధ్యకాలంలో రోడ్లపై ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఏపీలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ప్రకాశం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తున్న కారు కంభం సమీపంలో ఓ లారీని వెనక నుంచి బలంగా ఢీకొంది.
కంభం సమీపంలో అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.
Nikhil Siddharth: అలా చేస్తే.. నాకు సహించలేని కోపం వస్తుంది
కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24)గా గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sravana Somavaram Stothra parayanam Live: రెండవ శ్రావణ సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రం వింటే…