వరదల సమయంలోనూ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. వరద సహాయక చర్యల్లో పాల్గొనడంలేదంటూ.. ఓవైపు అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శిస్తే.. మరోవైపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ.. ఇక, టీడీపీ నేతలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి.. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదు… తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అన్నట్టుగా టీడీపీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు గోరంట్ల మాధవ్… అయిపోయిన పెళ్లికి…
ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు దెబ్బకొట్టాయి.. నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు.. అయితే, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి కేంద్ర బృందాలు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి ఓ అంచనాకు రానున్నారు.. రేపు రాష్ట్రానికి రానున్న ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత జిల్లాల్లో పర్యటించనుంది.. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప జిల్లాలు,…
ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడతాయా? నిన్న నైరుతి బంగాళా ఖాతం , పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళా ఖాతం ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళా ఖాతం దక్షిణ శ్రీలంక తీరానికి దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి వుంది. పై ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితలద్రోణి నైరుతి బంగాళా ఖాతంనుండి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోనైరుతి బంగాళా ఖాతంమీటర్లు ఎత్తులో విస్తరించి…
వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది. కూలిన ఇళ్లు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి.. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయని పేర్కొన్న ఆయన.. జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వరద గ్రామాల్లో పర్యటించి బాధితులను…
మొన్నటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏపీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చెరువులకు గండిపడిపోవడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యామ్ తెగిపోతుందని ఆకతాయిలు వదంతులు సృష్టించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా కొందరు గ్రామాలను వదిలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు అలర్ట్ అయిన అధికారులు సొమశిల డ్యామ్ సురక్షితంగా ఉందని వదంతులు నమ్మి…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండగా మారి ఏపీలో విజృంభించింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలకు 28 మంది మృతి చెందగా, 17 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారికోసం అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులకు గండ్లు పడడంతో వరద నీరు గ్రామాల్లోకి చేరింది. 1,316 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.33 లక్షల ఎకరాల్లో పంట నష్టం…
అంతా ఊహించిన విధంగా శనివారం అర్ధరాత్రి కడప జిల్లా కమలాపురంలో పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు బంద్ చేసారు. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన నిన్న సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఏ క్షణమైనా వంతెన కూలుతుందని ఎన్టీవీ హెచ్చరించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే…
భారీవర్షా ల కారణంగా నెల్లూరు జిల్లా వాసులు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. పెన్నానదికి వరద ఉధృతి అధికంగా ఉంది. పొర్లుకట్టలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి. వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. దాదాపు 30 గ్రామాలు నీట మునిగాయి. నెల్లూరులోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. భగత్ సింగ్ కాలనీ, జనార్ధన్ రెడ్డి కాలనీ, జయలలిలతా నగర్, పొర్లుకట్ట, ఈద్గా కాలనీ, శివగిరి కాలనీ, మన్సూర్ నగర్, మనుమసిద్ది నగర్, పుట్టా ఎస్టేట్, తల్పగిరికాలనీలు నీట మునిగాయి. వర్షాల వల్ల…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ తిరుచానూరు, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో వరద తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్థుల భవనం కూలిపోయింది. Also Read:అక్కడికి వెళ్లి ఎంతమంది చనిపోయారో తెలియడం లేదు : వైసీపీ ఎమ్మెల్యే అంతేకాకుండా…
ఏపీలో ముఖ్యంగా కడపలో భారీ భార్షలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రేపు ఆ జిల్లా మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేయగా…పలు రైళ్లు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి నుండి కడప మీదుగా నడిచే రైళ్లు రేపు రద్దు చేసారు. రేణిగుంట -గుంతకల్లు, గుంతకల్లు -రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు.. కడప -విశాఖపట్నం, విశాఖపట్నం -కడప మధ్య…