వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 96లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని, 30 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రతి 15 రోజులకి ఒక సారి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారని, 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అని చెప్పారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా…
ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో నది జలాల పంపిణీకి ఒప్పందం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయని.. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. అయితే, మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఇవ్వడానికి ఆ ఆర్డినెన్స్ తీసుకువచ్చాం అన్నారు..
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాల్సిన సమయంలో.. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. అయితే, గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… అయితే, తన ప్రాజెక్టులను తెలంగాణ అప్పగించిన తర్వాతనే ఈ జీవో అమల్లోకి తేవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. నోటిఫికేషన్ లోని రెండో షెడ్యూలు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్…
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన..…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మళ్లీ రాజుకుంటుంది… ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. తాజాగా.. పర్యావరణ అనుమతులు లేకుండానే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ సర్కార్.. 14.12.2020 నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేని కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఇచ్చిన ఆర్డర్‌ను భేఖాతర్ చేస్తుందని కేఆర్‌ఎంబీకి రాసిన…