Minister Narayana: నెల్లూరు సిటీ పరిధిలో మినీ మహానాడు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో పుట్టి పెరిగి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను.. ప్రజా సమస్యలను పుర సేవ యాప్ ద్వారా పరిష్కరిస్తున్నాం అన్నారు. ఇక, భగత్ సింగ్ కాలనీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాను.. ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేశాను అని మంత్రి తెలిపారు.
Read Also: Cyber Fraud : సీఎం ఓఎస్డీ పేరుతో సైబర్ వల.. వ్యాపారులకు ఉచ్చు..!
ఇక, నేను మాటల మంత్రిని కాదు.. పనులు చేసి చూపించే మంత్రిని అని పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనలో అభివృద్ధి కుంటపడింది అని మండిపడ్డారు. భారత దేశంలోనే VRC పాఠశాలను మోడల్ స్కూల్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్టంలోని అన్ని మున్సిపాలిటిల్లో మినరల్ వాటర్ ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు.