ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టు తెలిసింది.
YS Jagan: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు పంపారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తాను పార్టీ దూరంగా ఉన్నానని.. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి కనీసం పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీకి చెబుదాం అంటే కనీసం వినే పరిస్థితుల్లో లేదన్నారు.
గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గిపోతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి 45,855 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.
ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతపరిచేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చామని.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.