భారీ వర్షాలు, పోటెత్తిన వరదలతో బెజవాడ నీట మునిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మూగజీవాలు చనిపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం బుడమేరు. సహజంగా కృష్ణానది నుంచి విజయవాడకు వరదలు వస్తాయనుకుంటారు. కానీ ఈసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. దీంతో అసలు ఈ బుడమేరు ఎక్కడ పుడుతుంది.. ఎక్కడికెళ్తుంది.. బెజవాడకు, దీనికి సంబంధమేంటి.. లాంటి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. బుడమేరును బెజవాడ దుఃఖదాయినిగా చెప్పుకుంటూ ఉంటారు. పేరుకు తగ్గట్టే ఇది బెజవాడ…
గత కొన్ని రోజుల నుంచి విస్తారంగా కురిసిన భారీ వర్షాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురవడం వల్ల పెద్దగా నష్టాలేమీ సంభవించలేదు. అధికార యంత్రాంగం ఎప్పటి కప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. వాతావరణం పొడిగా మారి ఎండ పొరలు…
విజయవాడలోని సితార, రాజరాజేశ్వరి పేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునగడం తో అపార్ట్మెంట్ల పైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏరకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లు ముంపు…
MK Meena: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆదేశాలతో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి రానున్న నూతన విధానాలపై సచివాలయం…
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు రాగా.. వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. ఏఎస్పీలుగా ఉన్న ఏడుగురికి నాన్ కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు లభించాయి.
దేశంలో నాల్గవ భాష తెలుగు, పదికోట్ల మంది మాట్లాడే భాష తెలుగు.. అమెరికాలో తెలుగు 11వ భాష.. అదీ తెలుగువారి సత్తా.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు గొప్పదనం గురించి కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.
విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామన్నారు.
పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త తెలిపింది. ఈ నెల 31వ తేదీ నాడే పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పింఛన్లను ఈ నెల 31వ తేదీనే ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.