ఏపీని వర్షాలు వీడటం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 2 రోజుల్లో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి కోనసీమ, ఎన్టీఆర్ తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే.. అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24 గంటలో ఉత్తరాంధ్ర లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర అంతట వర్షాలు ఉంటాయని తెలిపారు. అయితే.. ఇవాళ అనకాపల్లి జిల్లా చోడవరం 11సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. తీరంలో 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్యకారుల వేట వెళ్లవెద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
West Bengal : రైలులో ఎమ్మెల్యే ప్రయాణం.. పక్కన ఉంది భార్య కాదా? షాక్ లో టీటీఈ
అయితే.. ఇటీవల కురిసిన వర్షాలకే ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజా జీవనం అస్తవ్యస్థమైంది. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత ఐదు రోజులుగా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదు రోజులుగా విజయవాడలోనే ఉంటూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదలతో నిరాశ్రులైన వారిని ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆహారం, నిత్యావసర సరుకులు ఇలా అన్ని బాధితులకు సమకూర్చుతున్నారు. ఇప్పుడిప్పుడు కొంత ఉపశమనం కలుగుతుందనగా.. మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోవడంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడలో ఈ రోజు ఉదయం మరోసారి వర్షం కురిసింది. ఇదేకాకుండా.. బుడమేరుకు వరద పెరగడంతో బెజవాడ వాసుల్లో భయం మొదలైంది. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు సీఎం చంద్రబాబు. గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.
Koneti Adimulam : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు