ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన 3 రాజధానుల బిల్లు గత అసెంబ్లీ సమావేశాలలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై సీఎం జగన్ మాట్లాడుతూ.. 3 రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని, కొన్ని సవరణలతో మళ్లీ బిల్లును ప్రవేశపెడుతామని అప్పుడే చెప్పారు. దీంతో 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తారనుకున్న వారితో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ 3 రాజధానుల వచ్చే బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానుల సవరణ బిల్లును ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా చంద్రబాబు చేసేవన్నీ డ్రామాలే, లోకేష్ ఒక పనికిరాని పప్పు అంటూ విమర్శలు చేశారు. టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రావాల్సిందేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో విద్యుత్ శాఖలో రూ.70 వేల కోట్ల అప్పు ప్రజలపై మోసారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని త్వరలోనే గాడిలో పెడుతామన్నారు. ఉద్యోగులందరికీ పీఆర్సీని త్వరలోనే అమలు చేస్తామన్నారు.