ఒక్కొ ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. నిర్ధేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నాం అన్నారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్ళు గ్రౌండ్ అయ్యాయి. లేఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తాం. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తాం. జగన్ సర్కార్ కు ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా సహకరించాలి. అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారు అని పేర్కొన్నారు.