Home
Ap Local Body Elections
Ap Local Body Elections News
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
AP Local Elections Polling Stations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల అనుమతితో అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఈ జాబితాను వెల్లడించినట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 12న గ్రామపంచాయతీల పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు సంబంధించి… -
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
Daggubati Purandeswari: తూర్పుగోదావరి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ఐక్యంగా పోటీ చేస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి అన్ని భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలిసి… -
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరిగింది. కార్యకర్తల పోరాట పటిమ, ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాన్ని రూపొందించాలని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన వ్యూహం అప్పటి పరిస్థితులకు,… -
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ఆదేశాలు రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 100 పట్టణ స్థానిక సంస్థలకు… -
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎన్నికల సన్నద్ధతపై వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమైతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం.. డివిజన్లు, వార్డుల పునర్విభజనకు సంబంధించిన కేసుల్లో… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఈసీతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి స్థానిక ఎన్నికలకు సంబంధించి సంసిద్ధత ప్రకటించడం, ఎస్ఐఆర్ (SIR)… -
Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన, వివిధ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న కోర్టు కేసుల ప్రస్తుత స్థితిగతులు,… -
Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనమంతా పవన్ కల్యాణ్ కోసమే పనిచేస్తున్నాం.. గ్రూప్ రాజకీయాలు వద్దు అని స్పష్టం చేశారు.. గత కార్పొరేషన్… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన నివేదికను ఏకసభ్య కమిషన్ హైకోర్టుకు సమర్పించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు పలు కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, అవసరమైన ప్రక్రియలు పూర్తైన వెంటనే ఎన్నికలు… -
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. వేసవి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!