AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సిద్ధమవుతోంది. మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. 41 యూఎల్బీలకు సంబంధించిన వార్డు వారీ ఓటర్ల జాబితాల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తై తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు అధికారులు.
Also Read
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అదనపు బ్యాలెట్ బాక్సులను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మున్సిపల్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలను కూడా రెండు విడతల్లో నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియలపై దృష్టి సారించిన అధికారులు.. హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేయనున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!