AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేశాయి. మరొకవైపు, స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ తాండవ యోగేష్ అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
అలాగే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ పనితీరు, నివేదికపై సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా హైకోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. మరోవైపు, పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ విలీన అంశంపై పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..