CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులతో కీలకంగా చర్చించారు. రానున్న ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జ్ మంత్రులదే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత అని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత అత్యంత కీలకమని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సీఎం సూచించారు.
మున్సిపల్ ఎన్నికలతో పాటు దశల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రులకు చంద్రబాబు తెలిపారు. కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను రైతులకు ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ఇక, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల ముసుగులో వైసీపీకి చెందిన రౌడీ మూకలు, అసాంఘిక శక్తులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.. బెంగళూరులో కూర్చొని జగన్ ఏపీలో రిమోట్ కంట్రోల్ ద్వారా రౌడీ గ్యాంగ్‌లతో అరాచకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ ఆర్డర్‌ను ఎవరైనా దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే రైల్వేలో అమలవుతున్న చట్టాలను రాష్ట్రంలోనూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల ముసుగులో అసాంఘిక శక్తులు విధ్వంసానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు.. ఇక, సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై వస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!