YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి.. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేశారు. గత మూడు నెలలుగా ప్రతి వారం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ సంస్థాగత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, స్థానికంగా ఉన్న సమస్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశం ఏకంగా 9 గంటలకు పైగా కొనసాగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో ఇవాళ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో వైఎస్ జగన్ వన్ టు వన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీ బలం, స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న సన్నద్ధత వంటి అంశాలపై ఇన్‌చార్జ్‌లతో నేరుగా చర్చించనున్నారు. ఇవాళ్టితో పాటు రేపు కూడా ఇన్‌చార్జ్‌లతో ముఖాముఖి సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు సంస్థాగత బలోపేతంపై జగన్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా పార్టీని మరింత పటిష్టం చేయడం, నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం, ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళికతో పనిచేయడంపై ఇన్‌చార్జ్‌లకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను వేగవంతం చేయాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరుస సమావేశాల ద్వారా పార్టీ నాయకత్వం, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, క్షేత్రస్థాయి నేతల మధ్య సమన్వయాన్ని పెంచే దిశగా జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు.
Also Read
- AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
- YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
- Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
- Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
తాజావార్తలు
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!