Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandipalli Rama Prasad Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వైసీపీకి ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా లేదన్న ఆయన.. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల భయంతోనే ఆ పార్టీ కోర్టులను ఆశ్రయిస్తోందని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని మంత్రి తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇటీవల హైకోర్టులో న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి వచ్చాయని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పల్లె పండుగ-3.0 ద్వారా భారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వార్డు స్థాయి నుంచి మేయర్ స్థాయి వరకు కూటమి విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి జెండా ఎగురవేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!