Home
Ap Local Body Elections
Ap Local Body Elections News
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి న్యాయపరమైన చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల అమలులో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను (జీఓలు) సవాలు చేస్తూ.. చేబ్రోలు రవికుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నేడు ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.… -
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
OTR: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ… టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మాత్రం సీట్ షేరింగ్‌పై క్లారిటీ రావడంలేదు. చర్చోపచర్చలు జరుగుతున్నా పీటముడి మాత్రం అలాగే కొనసాగుతోంది. స్థానిక సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. రెండున్నరేళ్ల కూటమి పాలనకు లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అద్దంపట్టబోతున్నాయి. ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, సీట్ల సర్దుబాటు, షేరింగ్ వ్యవహారం మాత్రం కుదరడంలేదు.… -
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సన్నాహకాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా అభివృద్ధి పనులు చేపడుతోందని, ఈ స్థానిక ఎన్నికల విజయంతో రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’ ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు. 2024… -
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలకు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శంఖారావం పూరించారు. రంపచోడవరం మండలం కాకవాడలో ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజనులు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని, అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసైనికులు ఎంతో త్యాగం… -
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, మిగిలిన 6 శాతం వరకు కూటమి పార్టీలు తమ పార్టీ పరంగా… -
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఈ భేటీలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీకి పవన్ కల్యాణ్ సహా జనసేన… -
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
BC Reservations Case: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)పై నేడు విచారణ జరగనుండటంతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం… -
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
Off The Record: ఏపీ కేబినెట్ మినిస్టర్స్ కొంత మందిపై సీఎం చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖల వారీగా సమీక్షల నుంచి ప్రజలతో సంబంధాల వరకు… రకరకాల అంశాల్లో ఆ బాపతు మంత్రులంతా పని తీరు మార్చు కోవాలని అదే పనిగా చెబుతున్నారాయన. అయినా సరే… వాళ్ళలో మార్పు లేదు సరికదా….ఏమవుతుందిలే అన్న నిర్లిప్తత పెరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇప్పటికీ కొద్ది మంది అదే స్థితిలో ఉన్నారట. ఇక తాజా కేబినెట్… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పునేఠా వెల్లడించారు. ఎన్నికల… -
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావొచ్చు అనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది.. ఈ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!