YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ కేడర్ పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పార్టీ తరఫున నిలబెట్టేందుకు బలమైన, ప్రజాదరణ ఉన్న మంచి అభ్యర్థులను వీలైనంత వేగంగా గుర్తించాలని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత కీలకమని, ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, ఎంపిక చేసే అభ్యర్థులు రాబోయే రోజుల్లో జరిగే సాధారణ ఎన్నికలకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తుచేశారు. అభ్యర్థుల జాబితాను ఆషామాషీగా కాకుండా.. పార్టీలో అందరితో మాట్లాడి, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఖరారు చేయాలన్నారు. పలు దఫాలుగా విస్తృత చర్చలు జరిపిన అనంతరమే తుది జాబితాను సిద్ధం చేయాలని కోరారు.
ఎన్నికల్లో పార్టీని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి విజయం దిశగా ముందుకు నడిపించే బాధ్యత నాయకులపైనే ఉందన్నారు. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, కేడర్కు దిశానిర్దేశం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల్లో ఉన్న భావాలను పసిగట్టాలని చెప్పారు. రెండున్నరేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలకు జరిగిన వెన్నుపోట్లు, నష్టాలు, కష్టాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రతి గడప వద్దకూ వెళ్లాలని సూచించారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన మంచి పనులను, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తుచేస్తూనే.. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను, మోసాలను వివరించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు బలగాన్ని ఉపయోగించుకుని, అనేక అడ్డదారుల్లో కుట్రలు పన్నుతారని జగన్ ఆరోపించారు. ఆ కుట్రలు, అడ్డంకులను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు అన్ని రకాలుగా ముందస్తుగానే సిద్ధం కావాలని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు (Plan-B) సిద్ధంగా ఉంచుకోవాలని రీజినల్ కో-ఆర్డినేటర్లకు సూచించారు.
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..