ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ పై ఆఏపీలోని ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అంతేకాకుండా సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీని కలిసిన ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు.
ఈ సందర్బంగా వైఎస్సార్ పీటీడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులను ఉద్యోగులుగా చేసిన ప్రభుత్వంపై సమ్మె కరెక్ట్ కాదని ఆయన హితవు పలికారు. కరోనా సమయంలో పని చేయకున్నా ప్రభుత్వం జీతాలు ఇచ్చిందని, సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రుల కమిటీ చెప్పిందాని ఆయన వెల్లడించారు. 6,900 కోట్ల నష్టంలో ఆర్టీసీని ప్రభుత్వం కష్టాలనుంచి గట్టెక్కించిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు సమ్మెను వ్యతిరేకించాలని, ఆర్టీసీలోని 75 శాతం ఉద్యోగులు సమ్మెను వ్యతిరేకిస్తున్నారన్నారు.