భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలెర్ట్ అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లోస్ మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. సోమశిల రిజర్వాయరుకు గతంలో ఎన్నడు రానంత వరద ఈ సారి వస్తోందన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తం చేస్తున్నామని అని బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ , హోం మంత్రి తానేటి వనితలు పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్ర స్థాయి పర్యటనను రద్దు చేసుకోవాలని కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు లేఖ రాసారు. రాయలసీమ లిఫ్ట్ సీఈ, ఎస్ఈలు కరోనా బారిన పడ్డారని లేఖలో స్పష్టం చేసిన ఇరిగేషన్ సెక్రటరీ… కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని పేర్కొన్నారు శ్యామలరావు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ క్షేత్ర స్థాయి పర్యటన సాధ్యం కాదని కేఆర్ఎంబీకి తెలిపారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలనుకున్న కేఆర్ఎంబీకి ఇంకా పరిధిని…