ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘రిలీజ్ రోజు అనగా జనవరి 12 తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు.అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ…
కోర్టు ధిక్కార కేసులో నోటీసులు పంపకుండానే వకాల్తా దాఖలు చేయడం పై హైకోర్ట్ సీరియస్ అయింది. నోటీసులు పంపకుండా వకాల్తా తీసుకున్న కోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీచేశారు. కృష్ణాజిల్లా మొవ్వ మండల డిప్యూటీ తాహసీల్దార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశించిన సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కార పిటీషన్‌ను దాఖలు చేశారు న్యాయవాది కే.తులసీదుర్గాంబ. నోటీసులు వెళ్లకుండానే…
ఆ పదవి నుంచి ఎవరు ఉంటారో.. మరెవరు పోతారో తెలియదు. కోర్టు నిర్ణయం.. మెడమీద కత్తిలా వేళ్లాడుతోంది. కంటిపై కునుకు లేకుండా చేస్తోందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. హైకోర్టు విచారణతో సభ్యుల ఉలికిపాటు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో టీటీడీ బోర్డులో సభ్యుడంటే ఆషామాషీ విషయం కాదు. ఎక్కడెక్కడ నుంచో సిఫారసులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలూ పోటీపడుతున్నారు. గతంలో…
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా పడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను…