Nellore Court Robbery Case: కోర్టులో చోరీ కేసు సీబీఐకి.. హైకోర్ట్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి విదేశాల్లో ఆస్తులు.. బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు వైసిపి నేత కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని పత్రాలు విడుదల చేయడం..అవి నకిలీవని పోలీసుల విచారణలో వెల్లడైంది. కోర్టులో కేసు విచారణలో ఉన్న దశలోనే సాక్షాలు చోరీ కావడంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ అంశం పై సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని టీడీపీ, వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు.
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సింగపూర్. మలేషియా. హాంకాంగ్ ..బ్యాంకాక్ లలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అక్కడ బ్యాంకులలో ఖాతాలు తెరిచారని కాకాని గోవర్థన్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. అంతేకాకుండా ఆయన ఆస్తులు విలువ వెయ్యి కోట్లు ఉంటుందని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి 20 పత్రాలను విడుదల చేశారు..2016వ సంవత్సరం డిసెంబర్ 23న కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు సంచలనం కలిగించాయి. కాకాని ఆరోపణలపై కంగు తిన్న సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. విదేశాలలో బ్యాంకు ఖాతాలు.. వ్యాపారాలు తనకు లేవని స్పష్టం చేశారు. కాకాని విడుదల చేసిన పత్రాలు నకిలీవని వీటిపై న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. తన పరువుకు నష్టం కలిగించిన కాకానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
Read Also: Bandi Sanjay : కేసీఆర్‌పై హత్య కేసు నమోదు చేయాల్సిందే..!
దీంతో పోలీసులు విచారణ జరిపి ఆ పత్రాలు నకిలీవని తేల్చారు. అంతేకాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా ఆయనతో సంప్రదింపులు జరిపిన వారిని విచారించి నలుగురిని నిందితులుగా తేల్చారు. ఏ1 కాకాణి గోవర్ధన్ రెడ్డి ని తమిళనాడుకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణి మోహన్ …వెంకట కృష్ణన్.. హరిహరన్ .లను ఇతర నిందితులుగా చేర్చారు. కాకాణి అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో ఆయన సుప్రీంకోర్టు కు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు నిందితులు..నకిలీ స్టాంపులు పత్రాలు రూపొందించారని గుర్తించారు . వీరిని అదుపులోకి తీసుకొని నకిలీ పత్రాలకు ఉపయోగించిన లాప్ టాప్.. ప్రింటర్.. హార్డ్ డిస్క్.. సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని నాలుగవ అదనపు జ్యూడిషల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 13న కోర్టులో చోరీ జరిగింది. ఈ చోరీలో కాకాని. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న బ్యాగును దుండగులు తీసుకెళ్లారు. దొంగతనాలకు శిక్షలు విధించే కోర్టులోనే చోరీ జరగడంపై హైకోర్టు స్పందించింది. అంతేగాక ఇనుము దొంగతనానికి వచ్చిన దొంగలను కుక్కలు తరమడంతో కోర్టులోకి వెళ్లి దాక్కున్నారని..అక్కడి బీరువాలలోని బ్యాగ్ లను తమ వెంట తీసుకువెళ్లారని జిల్లా పోలీసులు విచారణలో తేల్చారు. దీంతో ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తన ప్రమేయం లేకున్నా.. తనపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సిబిఐతో విచారణ జరపాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కేసును పరిశీలించిన హైకోర్టు ఈ చోరీ విషయంపై సీబీఐ (CBI) తో విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను తప్పు చేయలేదని అందువల్లే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని మంత్రి కాకాని ప్రకటించారు. సిబిఐ విచారణ వేయాలని తానే కోరానని హైకోర్టు కూడా అదే విధంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు. సిబిఐ విచారణ కు ఇస్తే న్యాయమూర్తి సమక్షంలో విచారణ జరగాలని టిడిపి నేతలు కోరడాన్ని వారి నైజాన్ని స్పష్టం చేస్తుందని విమర్శించారు. మంత్రిగా ఉంటూ తప్పుడు పనులు చేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఇలాంటి వ్యక్తికి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. సిబిఐ కూడా సత్వరమే విచారణ పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: World’s Oldest Cat: 26 ఏళ్ల ఫ్లాస్సీ.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా రికార్డు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!