ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం దామోదర్ సవాంగ్ హైకోర్ట్ కు హాజరయ్యారు. తనకు పోస్టింగ్ ఇవ్వటం లేదని గతంలో పిటిషన్ వేశాడు ఓ సబ్ ఇన్ స్పెక్టర్. పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాడు సదర్ సబ్ ఇన్ స్పెక్టర్. ఈ కేసులో కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు గౌతం సవాంగ్.
ఇదిలా ఉంటే మరో ఐఎఎస్ అధికారి కూడా కోర్టుకి హాజరయ్యారు. ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య. ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసిన ఉద్యోగికి జీతం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు చేయని పూనం మాలకొండయ్యపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. దీంతో నేడు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు పూనం మాలకొండయ్య.
మరోవైపు కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. NBW జారీ చేసింది నూజివీడు కోర్టు. 2018లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేసిన కేసులో తాజాగా వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది.
Read Also: Pawan Kalyan: అమరావతికి మద్దతిస్తే దాడులు చేస్తారా?