ఆనందయ్య మందు పంపిణీపై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మందు పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. 4 రోజులు సమయం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు కోర్టు మందు ఉంచలేదు అని అడిగింది. 15 నిమిషాల్లో ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. అయితే అల్కహాల్ మరియు సిగరేట్…
కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథలైతే ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనుండగా.. అల్పాదాయ…
మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 5 ప్రభుత్వశాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని..అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన వెల్లడించారు. తక్షణం నష్టపరిహారం కింద మృతులకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటిస్తున్నామన్నారు. లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. ఘటనాస్థలాన్ని డిఎంజి నేతృత్వంలో వెంటనే మైనింగ్ అధికారులు పరిశీలించారని ఆయన తెలిపారు. క్వారీనిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని…
ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను నియంత్రించింది ఏపీ ప్రభుత్వం. సీటీ స్కాన్, హెచ్చార్ సీటీ స్కాన్ ధరను రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులతో పాటు ఆస్పత్రుల్లోనూ సీటీ స్కాన్ నిమిత్తం రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని…