నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇవ్వాళ్టితో ఉప ఎన్నిక ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోసం ఆపార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు లో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక్కడ రోడ్లు గుంతలు చూడలేక మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారు. మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో తిరుగుతున్నారు.…
ఏపీలో 5లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ ఫీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయం అన్నారు స్వరూపానందేంద్రస్వామి, కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకం అన్నారు. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు…