GPF Money: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీగా విత్ డ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఏపీ ప్రభుత్వం ఎక్కడ రుణం దొరికితే అక్కడ అప్పులు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదును విత్ డ్రా చేసింది ఏపీ ప్రభుత్వం. 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్ల మేర ప్రభుత్వం డ్రా చేసినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయడాన్ని తప్పు పడుతూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ స్పష్టీకరిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ… ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయిపోతున్నాయి. గతంలో ఇదే తరహాలో డబ్బులు డ్రా అయిపోతే.. కేసు నమోదు చేస్తామని చెబితే.. తిరిగి డబ్బులు జమ చేశారు. జీపీఎఫ్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకుని చూస్తే డబ్బులు విత్ డ్రా అయినట్టు వెలుగులోకి వచ్చింది. నా ఖాతా నుంచే రూ. 80 వేల మేర డ్రా అయింది. నా ఒక్కడికే కాదు.. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను ప్రభుత్వం డ్రా చేసేసిందన్నారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
గతంలో జమ చేసిన డీఏ బకాయిలను తిరిగి ప్రభుత్వం తీసేసుకుంది.రూ. 800 కోట్లను 90 వేల మంది ఉద్యోగుల నుంచి ప్రభుత్వం డ్రా చేసేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల కోసం ప్రభుత్వం కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం డ్రా చేసేసింది. నా అనుమతి లేకుండా నా ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది..? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేసేది తప్పు కాదు.. నేరం. మా జీపీఎఫ్ డబ్బులను తీసుకున్న ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెడతాం. మా డబ్బులను తిరిగి మా ఖాతాల్లో జమ చేసినా సరే.. కచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మేం ఏజీని కూడా ప్రశ్నిస్తాం. మార్చి నెలాఖరులో డబ్బులు విత్ డ్రా చేస్తే.. ఇప్పటి వరకు మెసేజ్ ఇవ్వకపోవడం తప్పు అంటున్నారు.
Building Collapse: ముంబయిలో కుప్పకూలిన భవనం.. 14 మంది మృతి
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!