రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నెల్సన్ మండేలా చెప్పినట్లు ప్రతి ఒక్కరు విద్యను అభ్యసిస్తే రాష్ట్ర ప్రగతికి మూల స్తంభాలు అవుతారని, ఆయన మాటను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు మంత్రి ఆర్ కె.రోజా. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని రాష్ట్రంలోనే ప్రతి స్కూళ్లను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో చదవడానికి, ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా సంతోషంగా చదువుకోవడానికి వస్తున్నారన్నారు. నగిరి నియోజకవర్గం అమ్మ ఒడి చెక్కును తల్లిదండ్రులకు అందజేస్తున్న సందర్భంగా రాష్ట్ర క్రీడల టూరిజం శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రాజా మాట్లాడారు.
నగరి నియోజకవర్గ స్థాయిలో పుత్తూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న 3వ విడత అమ్మ ఒడి పథకం ద్వారా 27 కోట్లు 91 లక్షల చెక్కు ను మంత్రి రోజా తల్లి దండ్రులకు అందచేసారు. దీని ద్వారా 19వేల 958 మంది లబ్దిదారుల తల్లులకు ఈ అమ్మ బడి పధకం ద్వారా రూ 13 వేలు వారి ఖాతాల్లోకి చేరాయన్నారు. గతంలో ఆడపిల్లలు స్కూళ్లలో చదువుకుంటూ బాత్రూంకి వెళ్లాలంటే ఇంటికి వెళ్లేంతవరకు నరకయాతన పడే వారిని కానీ ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి హంగులతో పాఠశాలలు ఉన్నాయని ఆమె అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్ పెద్ద మనసుతో ఆలోచించి మన పాఠశాలలో చక్కటి బాత్రూమ్స్ అలాగే మినరల్ ఆరో వాటర్ ప్లాంట్ మంచి డెస్కులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతి విద్యార్థులకు రంగురంగుల యూనిఫామ్స్, షూస్ పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ఉచితంగా ఇస్తున్నారని, మధ్యాహ్నం పూట నాణ్యమైన ఆహారం పిల్లలకి పెడతారని చెప్పుకొచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు కానీ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఎంతో ఆలోచనతో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎవరికీ రాని ఆలోచనతో మన ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు అని ఆమె తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి స్కూల్ కి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో ప్రతి మహిళ గుండె మీద చేయి పెట్టుకుని తనకు అండగా జగన్ ఉన్నాడని ధైర్యంగా బ్రతుకుతున్నారన్నారు. ఎందుకంటే వీరికి కావాల్సిన సౌకర్యాలను పెద్ద మనసుతో జగనన్న చేస్తున్నాడు కనుక వారు ఆనందంగా ఉన్నారని మంత్రి రోజా అన్నారు.
TS TET 2022: రేపే టెట్ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే..?