Sunkara Padmasree: మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు!
- అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా?
- చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?
- కృష్ణంరాజు వాగితే.. కొమ్మినేని వెటకారాలు ఆడారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?.. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని అరెస్టు చేయరా? అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.
‘రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా?. మళ్లీ మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారు. ఓ చానల్‌లో కృష్ణంరాజు వాగితే.. కొమ్మినేని వెటకారాలు ఆడారు. వాటిని సోషల్ మీడియాలో కట్ చేయకుండా వీడియోలు పెట్టారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు. నిన్న మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నా.. కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని అరెస్టు చేయరా?’ అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.
Also Read
Also Read: Nithin : ‘తమ్ముడు’ మూవీ నుంచి ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్ ..
‘రాష్ట్ర హోంమంత్రి, మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ ఎందుకు మాట్లాడటం లేదు?. మహిళల క్యారెక్టర్ కించపరిచిన వారినే అరెస్టు చేయలేకపోతే.. ఇక రాష్ట్రంలో మహిళలకు మీరేం న్యాయం చేయగలరు. కొమ్మినేని, కృష్ణంరాజులు ఇద్దరినీ అరెస్టు చేయాలి. ప్రభుత్వం చేతకాని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు స్పందించాలి. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి’ అని సుంకర పద్మశ్రీ కోరారు. ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.
తాజావార్తలు
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!