ఏడాది పాలనలో ఏమీ చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడుస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంను వదిలి పెట్టమని, జనాలకు వైసీపీ పార్టీ అండగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చారని.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం పలు పథకాలను తుంగలో తొక్కిందని మాజీ మంత్రి విడదల రజిని పేరొన్నారు.
‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు విడదల రజిని మాట్లాడుతూ… ‘వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వృద్ధులు, వితంతువులకు గ్రామాల్లో ఇచ్చే పెన్షన్లను నిలిపివేశారు. తల్లికి వందనం ఊసే లేదు. కూటమి ప్రభుత్వం పలు పథకాలను తుంగలో తొక్కింది. రెడ్ బుక్ రాజ్యాంగంను అమలు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానాలపై వైసీపీ పోరాటం కొనసాగుతుంది’ అని అన్నారు.
Also Read: RK Roja: సూపర్ సిక్స్ పక్కనపెట్టి.. సూపర్ స్కామ్‌లు చేస్తున్నారు!
ధర్మవరంలో వైసీపీ వెన్నుపోట దినోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… ఏడాది కాలంలో అన్నీ హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఇది అంటూ వ్యంగంగా కామెంట్స్ చేశారు. ‘తల్లికి వందనం, అన్నదాత సుఖీభవా, నిరుద్యోగ భృతి, అన్నీ అందుతున్నాయి. మహిళలు ప్రతి రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు. చంద్రబాబు ప్రతి నెల ఒకటోతేది ఒక టెలీ సీరియల్ ను చూపిస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా మోసాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ సొంత సినిమా కూడా ఆడించుకోలేపోతున్నాడు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవిని వైఎస్ జగన్ అవమానించారని ప్రచారం చేశారు. ఇది సరికాదు’ అని కేతిరెడ్డి అన్నారు.