YS Jagan: ప్రకాశం జిల్లాలోని పొదిలిలోని పొగాకు బోర్డు దగ్గరకు వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్.. పొగాకు రైతులను పరామర్శించి వారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. రైతులను అడిగి పొగాకు కొనుగోలు రేట్ల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Read Also: Sonam Raghuwanshi: 2 వారాలు గడుస్తున్న దొరకని రాజా మొబైల్.. బెంగళూరు టు మేఘాలయ మిస్టరీ అందులోనే!
ఇక, వరి, మిర్చి, పొగా పంట చూసినా గిట్టుబాటు ధర లేదు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది వైసీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చాం.. పంట వేసే సమయంలోనే రైతన్నలకు రైతు భరోసా అందించాం అని సూచించారు. గత ఏడాది రైతు భరోసా కింద ఇస్తున్న సొమ్ము ఆగిపోయింది.. మోడీ ఇచ్చే ఆరు వేలు కాక.. మరో 20 వేలు ఇస్తామని చెప్పారు.. జూన్ వచ్చినా ఇంత వరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదని ఆరోపించారు. ఇక, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ అందించే వాళ్ళం.. ఆర్బీకేలతో ఉచిత పంటల బీమా అందించాం.. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్ ఆరోపణలు చేశారు.
Read Also: Vangalapudi Anitha: కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్నిన హోంమంత్రి..
అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రతీ రైతుకు ఎకరాకు అదనంగా 10 వేలు ఇచ్చే వాళ్ళం.. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం.. కేంద్రం ప్రకటించిన పంట్కే కాకుండా పలు పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించాం.. ఏ పంటకైన గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకుని కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది.. పొగాకు పంటకు గత ఏడాది కేజీ 360 రూపాయలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం.. కానీ, ప్రస్తుత ప్రభుత్వం పొగా రైతులను పట్టించుకుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.