Kollu Ravindra: మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. పీడీఎస్ కేసు నమోదు కావడంతో మూడు నెలలు తండ్రి కొడుకు అడ్రస్ లేకుండా పోయారు.
Jethwani Case: ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Chandrababu: ఏపీ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్ డెవలప్‌మెంట్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలు పెరగాలి, సిజేరియన్లు తగ్గించాలన్నారు.
Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించాలన్నారు.
AP DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ నిరసన దీక్ష చేస్తామన్నారు. శాసన మండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం.. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది.. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు అని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని బొత్స…
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది
Minister Atchannaidu: కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Minister Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పర్యటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండ బీచ్ లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు విధానాల అవశేషాలతో పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు.. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం..