Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం దూకుడు
- 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- ఎక్స్‌లో పేర్కొన్న అమిత్ మాల్వీయా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చకచకా పనులు జరిగిపోతున్నాయి. తాజాగా కోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్‌లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్లో గత టీఎంసీ ప్రభుత్వం హయాంలో 15 ఏళ్లు ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 15 రోజుల్లోనే పూర్తి చేసిందని బీజేపీకి చెందిన అమిత్ మాల్వీయా తెలిపారు. 366 మీటర్ల పొడవున్న ఈ అసంపూర్ణ మార్గం కోల్‌కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vతో కలుపుతుందని అన్నారు. ఆర్వీఎన్ఎల్ ఈ పనిని వరుసగా రెండు వారాంతాల్లో పూర్తి చేసిందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
‘‘మమతా బెనర్జీ 15 ఏళ్లలో చేయలేని పనిని సువేందు అధికారి, బీజేపీ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పూర్తిచేశారు. కోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్‌లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్ దగ్గర చాలాకాలంగా ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ఆర్‌విఎన్‌ఎల్ (RVNL) నిర్ణీత గడువు కంటే ముందే విజయవంతంగా పూర్తి చేసింది. కోల్‌కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vలోని ఐటీ హబ్‌తో అనుసంధానించే న్యూ గరియా-ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్‌ను పూర్తి చేయడానికి.. ఈ 366 మీటర్ల లోపించిన భాగం చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ సంవత్సరాల తరబడి ఎందుకు నిలిచిపోయింది?, ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ట్రాఫిక్ మళ్లింపునకు పదేపదే అనుమతి నిరాకరించింది. పనిని పూర్తి చేయడానికి ఆర్‌విఎన్‌ఎల్ కేవలం వరుసగా రెండు వారాంతాల పాటు రాత్రిపూట ట్రాఫిక్ దిగ్బంధనాలకు మాత్రమే అనుమతి కోరింది. రాజకీయ అడ్డంకి తొలగిపోయిన వెంటనే పనులు వేగవంతమయ్యాయి. సంవత్సరాలుగా, ఈ ఆలస్యాలకు కారణం “సాంకేతిక కారణాలే” అని బెంగాల్ ప్రజలకు చెబుతూ వచ్చారు. కానీ, అసలు అతిపెద్ద సాంకేతిక సమస్య టీఎంసీ ప్రభుత్వమే అని తేలింది.’’ అని రాసుకొచ్చారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అనంతరం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర మద్దతుతో బెంగాల్ లో పనులు వేగవంతం అయ్యాయి.
What Mamata Banerjee couldn’t do in 15 years, Suvendu Adhikari and the BJP government have delivered in just 15 days.
🚇 RVNL has successfully completed the long-delayed girder launching work at the Chingrighata crossing section of Kolkata Metro’s Orange Line, ahead of schedule.… pic.twitter.com/JWI8IL2wbV
— Amit Malviya (@amitmalviya) May 25, 2026
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!