ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ లిమిటెడ్‌ను విద్యుత్ పంపిణీ సంస్థగా మార్చేసింది… ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ (ఏపీ రాస్కామ్ )గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పంపిణీ కోసం విద్యుత్ పంపిణీ సంస్థగా ఏపీ రాస్కామ్ పనిచేయనుంది… ప్రస్తుతానికి రాష్ట్రంలోని మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకుని…
ప్రభుత్వ భూముల వేలానికి లైన్ క్లియర్ అయ్యింది.. నిధుల సమీకరణకు ప్రభుత్వ భూముల వేలానికి ఉన్న సాంకేతిక అడ్డంకిని తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేసింది.. 2012లో ప్రభుత్వ భూముల వేలంపై నిషేధం విధిస్తూ జారీ చేసిన జీవోకు మార్పులు చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్… నిషేధం అంటూ నాటి జీవోలో పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక,…
TTD జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆర్డినెన్స్ వర్కవుట్ అయ్యేనా? కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారా? TTDపై తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి? సిఫారసులు పెరిగి 81 మందితో జంబో కమిటీ ఏర్పాటు..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వానికి ఇటీవలకాలంలో బాగా డిమాండ్ పెరిగింది. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టుగా TTD బోర్డులోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు.. రెండుసార్లు కాదు.. మూడుసార్లు కాదు.. నాలుగోసారి…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అవుతుంది.. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం..ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మకం, సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలిపే అంశంపైనా చర్చించే ఛాన్సుంది. ఇక, దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీవింగ్ ఏర్పాటుపై చర్చించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ…
పర్యాటకులకు మంత్రి అవంత శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. గత కొన్ని నెలల నుంచి నిలిచిపోయిన పాపికొండల బోటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం బోటు ఆపరేటర్లతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టూరిజం, నీటి పారుదల శాఖ అధికారులు, బోటు ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నవంబర్ 7 నుంచి పాపికొండల్లో బోటింగుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులకు బోట్లలో నిబంధనల ప్రకారం…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్ విసిరారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి… కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు ఆరోపణలపై స్పందించారు.. విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్న ఆయన.. కానీ, సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైందని ఎద్దేవా చేసిన శ్రీకాంత్ రెడ్డి.. తాను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు……
విజయవాడలోని జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల జనసేన అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని.. వీటి మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం…
మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది రాష్ట్రంలో. టిడిపి హయాంలో అప్పులు చేసి సంపద సృష్టికి ఉపయోగించాము. ఆదాయాన్ని పెంచే మార్గం చూపించాము. జగన్ చేసిన అప్పుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది. 5నెలల్లో 8 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి…
దేశమంతా విద్యుత్ కొరత, కోతలున్నాయంటూ, ఏపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. బొగ్గు కొరత ఉందని.. కేంద్రం సరఫరా చేయడం లేదంటూ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది. జగన్ భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం ఏపీలో కృత్రిమ విద్యుత్ కొరత సృష్టించింది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు ప్రభుత్వం రూ.4,500 కోట్ల వరకు బకాయి పడింది. 2021 సెప్టెంబర్ 2న కేంద్ర…
దళితులను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోంది అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేష్ ఏం చేస్తున్నారు అని అడిగారు. వైసీపీలోని ఓ…