మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విలువ ఆధారిత పన్నులో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది ఏపీ అబ్కారీ శాఖ.. మద్యం మూల ధరపై మొదటి విక్రయం జరిగే చోట పన్ను ధరల సవరణ చేశారు.. దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు జరిగాయి.. రూ .400 ధర లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ వర్తింపజేయగా.. రూ. 400 నుంచి రూ. 2500 వరకూ ఉన్న మద్యం కేసుకు సంబంధించి 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకున్నారు.. ఇక, రూ.2500 నుంచి రూ.3500 వరకూ ఉన్న మద్యం కేసుకు 55 శాతం మేర వ్యాట్ పడనుంది.. మరోవైపు.. రూ.3500 నుంచి రూ. 5000 వరకూ ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం మేర వ్యాట్ వడ్డించనున్నారు..
Read Also: దానిపై ఉత్తర్వులు తీసుకురండి.. బీజేపీకి మంత్రి గంగుల సవాల్
ఇక, రూ.5000, ఆ పై ధర పలికే మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా తయారై ప్యాకింగ్ చేసిన బీర్ల కేసుపై రూ. 200 కంటే ధర తక్కువ ఉన్న వాటిపై 50 శాతం వ్యాట్ వడ్డించనుంది సర్కార్… రూ. 200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేస్ పై 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం ఉందని పేర్కొన్న ప్రభుత్వం.. ఇక అన్ని రకాల వైన్ మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది… రెడీ టు డ్రింక్ వెరైటీలన్నిటిపైనా 50 శాతం మేర వ్యాట్ పన్ను వడ్డించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ అబ్కారీ శాఖ.